Google: గూగుల్ క్రోమ్ తో ‘చాలా ప్రమాదం’.. హెచ్చరించిన కేంద్రం

  • సైబర్ దాడులు జరిగే ఆస్కారం ఎక్కువంటూ సెర్ట్ నివేదిక
  • పాప్యులారిటీతో ముప్పు ఎక్కువైందని వెల్లడి
  • పాత వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచన
Center Warns Chrome Is More Vulnerable To Cyber Attacks

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు.. ఏది వాడినా బ్రౌజర్ గా గూగుల్ క్రోమ్ తప్పనిసరిగా ఉంటోంది. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యధిక మంది వాడుతున్న బ్రౌజర్ అది. దాదాపు 63 శాతం మంది దాన్నే వాడుతున్నారు. అయితే, దాన్ని వాడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజా హెచ్చరిక చేసింది. గూగుల్ క్రోమ్ ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చింది. దానితో సైబర్ భ్రత ముప్పు తీవ్రత అత్యధికమని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. దానికి సంబంధించి ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసింది.

క్రోమ్ కు ఉన్న పాప్యులారిటీతో కూడా సైబర్ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు అందులో పేర్కొంది. లక్ష్యంగా చేసుకున్న వినియోగదారులు, సిస్టమ్ పై సైబర్ దుండగులు ఆర్బిట్రరీ కోడ్ లతో దాడులు చేస్తున్నారని హెచ్చరించింది. ఇటీవలి కాలంలో క్రోమ్ యూజర్లపై ఆ దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, దాని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.  

సేఫ్ బ్రౌజింగ్ ఫ్రీ, రీడర్ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్ న ఎయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్, ఎక్స్ టెన్షన్స్, యాక్సెసబిలిటీ అండ్ కాస్ట్, యాంగిల్ హీప్ బఫర్ ఓవర్ ఫ్లో, ఫుల్ స్క్రీన్, స్క్రోల్, ఎక్స్ టెన్షన్స్ ప్లాట్ ఫాం, పాయింటర్ లాక్ ల ను సరిగ్గా వాడకపోవడం, వీ8 టైపింగ్ లో గందరగోళం, కూప్ లో బైపాస్ విధానాలు, వీ8లో హద్దుల్లేని మెమొరీ యాక్సెస్ వంటి కారణాలతో గూగుల్ క్రోమ్ లో సైబర్ దాడుల ముప్పు ఎక్కువగా ఉందని నివేదికలో సెర్ట్ హెచ్చరించింది.

అయితే, దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ముప్పును తప్పించేందుకు క్రోమ్ ను గూగుల్ అప్ డేట్ చేసిందని సెర్ట్ ఊరటనిచ్చింది. ‘98.0.4758.80’ వెర్షన్ వాడే యూజర్లకే ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఇప్పుడు ‘98.0.4758.80/81/82’గా అప్ డేట్ చేసిందని, దానితో ముప్పు లేదని తెలిపింది. మ్యాక్, లైనక్స్ వాడుతున్న వారి కోసమూ .80 వెర్షన్ లోనూ ఎన్నో రక్షణ మార్పులు చేసిందని పేర్కొంది. కాబట్టి క్రోమ్ పాత వెర్షన్లను వాడరాదని, కొత్త వెర్షన్ కు అప్ డేట్ కావాలని సూచించింది. కాగా, క్రోమ్ లో 27 సేఫ్టీ ఫీచర్లను అప్ డేట్ చేసినట్టు గూగుల్ ప్రకటించింది. 

More Telugu News