Shah Rukh Khan: ‘లవ్ దిస్ మ్యాన్’ అంటూ షారూక్ ఖాన్ కు శృతి హాసన్ మద్దతు

Shruti Haasan appreciates Shah Rukh Khan for paying tribute to Lata Mangeshkar
  • లతాకు షారూక్ నివాళి తీరుపై విమర్శలు
  • ఆ ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన శృతి
  • ఈ మనిషిని ప్రేమించాలంటూ కొటేషన్
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు దక్షిణాది నటి శృతి హాసన్ బాసటగా నిలిచారు. గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తీరుతో షారూక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండడం తెలిసిందే.

కానీ ఈ విషయంలో షారూక్ కు శృతి మద్దతుగా నిలిచారు. షారూక్ లతాకు నివాళి అర్పించిన ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో శృతి హాసన్ పోస్ట్ చేసింది. ‘లవ్ దిస్ మ్యాన్.. ఆల్వేస్ ఆల్వేస్’ (ఎప్పుడూ ఈ మనిషిని ప్రేమించు) అన్న క్యాప్షన్ తగిలించింది. శనివారం ముంబైలోని శివాజీ పార్క్ లో లతా మంగేష్కర్ అంత్యక్రియలు జరగడం తెలిసిందే.

షారూక్ ఖాన్ తన రెంచు చేతులు జోడించి దోసిలి పట్టినట్టుగా దువా చేయడం తెలిసిందే. ఆయన ఆ సమయంలో లతా కోసం అల్లాను ప్రార్థించినట్టు తెలుస్తోంది. దువా తర్వాత నోటి ద్వారా గాలి వదిలారు. ఇది ముస్లింలు అనుసరించే పవిత్ర ఆచారాల్లో ఒకటి. కానీ, చాలా మంది దీన్ని తప్పుగా భావించారు. షారూక్ ఉమ్మి వేశాడన్న పుకార్లు కూడా వ్యాపించాయి. అదే సమయంలో షారూక్ ఖాన్ కు మద్దతు పలికిన వారూ ఉన్నారు.
Shah Rukh Khan
Shruti Haasan
tribute
Lata Mangeshkar

More Telugu News