Nagarjuna: నాగార్జున సరసన సోనాల్ చౌహన్!

Sonal Chouhan in Nagarjuna Movie
  • ప్రవీణ్ సత్తారు తాజా చిత్రంగా 'ది ఘోస్ట్'
  • డిఫరెంట్ లుక్ తో నాగార్జున
  • విభిన్నమైన కథాకథనాలు  
  • ఈ నెల 12 నుంచి కొత్త షెడ్యూల్

సోనాల్ చౌహన్ చేసిన సినిమాలు చాలా తక్కువనే. కాకపోతే సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను పోస్టు చేస్తూ, యూత్ కి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తెలుగులో ఆమె ఎక్కువగా బాలకృష్ణ సరసన అలరించింది. 'లెజెండ్' .. 'డిక్టేటర్' .. 'రూలర్' వంటి సినిమాల్లో ఆమె ఆకట్టుకుంది.

గ్లామర్ పరంగా సోనాల్ కి వంకబెట్టవలసిన అవసరం లేదు. ఇక నటన పరంగా చెప్పడానికి ఆ స్థాయి పాత్రలు ఆమె చేయలేదు. అందాల సందడి పరంగానే ఆమెకి అవకాశాలు దక్కుతూ వచ్చాయి. అలాగే నాగార్జున తాజా చిత్రమైన 'ది ఘోస్ట్' సినిమాలోను ఆమెకి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ముందుగా కాజల్ ను తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వలన ఆమె తప్పుకోవడంతో, అమలా పాల్ ను అనుకున్నారు. పారితోషికం విషయంలో సెట్ కాకపోవడంతో సోనాల్ ను తీసుకున్నారట. ఈ నెల 12 నుంచి హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్లో ఆమె పాల్గొంటుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News