liver transplant: ఇక కష్టమే అనుకున్న తరుణంలో.. కాలేయ మార్పిడితో కోమా నుంచి బయటకు

A miracle transplant for a new mom after liver failure
  • హైదరాబాద్ లో అరుదైన కేసు
  • వైరల్ హెపటైటిస్ తో అక్యూట్ లివర్ ఫెయిల్యూర్
  • ప్రసవం తర్వాత విషమించిన తల్లి పరిస్థితి
  • ఆ తర్వాత కోమాలోకి
  • కాలేయ మార్పిడితో తిరిగి ప్రాణం
వైద్య రంగంలో కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన కేసులకు సంబంధించి అద్భుతాలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. తీవ్రమైన కాలేయ వైఫల్యంతో కోమాలోకి వెళ్లిపోయి, ఇక కష్టమేననుకున్న పరిస్థితి నుంచి.. కాలేయ మార్పిడితో ఆమె కోలుకోవడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

28 ఏళ్ల మహిళ ఆరు నెలల క్రితమే బేబీకి జన్మనిచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె పరిస్థితి క్రమంగా విషమించింది. వైరల్ హెపటైటిస్ గా వైద్యులు గుర్తించి చికిత్స చేశారు. అయినా కోలుకోక పోగా పరిస్థితి చేయి దాటిపోయింది. కోమాలోకి వెళ్లిపోయింది. ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం, రక్తం గడ్డ కట్టే సమస్యలు కూడా ఎదురయ్యాయి. దీంతో హైదరాబాద్ లోని పేస్ హాస్పిటల్ వైద్య బృందం ఈ కేసును సవాలుగా తీసుకుంది.

అత్యవసరంగా కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించారు వైద్యులు. జీవన్ దాన్ ట్రస్ట్ కింద ఆమె పేరును చేర్చారు. దాత లభించడంతో అత్యవసరంగా ఆమెకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

‘‘ట్రాన్స్ ప్లాంటేషన్ కు ముందు మెదడులో రక్త స్రావం అయితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బైలురూబిన్ ఎంతో ఎక్కువగా ఉంది. దాంతో అత్యవసరంగా లివర్ డయాలసిస్ చేశాం. ప్లాస్మా మార్పిడితో బైలురూబిన్ తగ్గడమే కాకుండా, మెదడులో వాపు తగ్గింది’’అని  ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఫణి కృష్ణ తెలిపారు.

చివరిగా మిగిలి ఉన్న ఒకే ఆప్షన్. కాలేయ మార్పిడి. కానీ, ఆశ్చర్యకరంగా కాలేయాన్ని మార్చిన ఆరు గంటల్లోనే ఆమె కోమా నుంచి బయటకు వచ్చింది. గత రెండు వారాల్లో చక్కగా రికవరీ అయినట్టు మరో ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ మధుసూదన్ తెలిపారు.
liver transplant
pace hospital
hyderabad
new mom
liver failure

More Telugu News