Ranbir Kapoor: రణ్ బీర్ కపూర్ తో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్?

Pooja Hegde in Ranbir Kapoor movie
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్'
  • మనిషి స్వభావంలో వచ్చే మార్పు చుట్టూ తిరిగే కథ
  • నాయకా నాయికలుగా రణ్ బీర్ కపూర్ - పరిణీతి చోప్రా
  • కీలకమైన పాత్రలో అనిల్ కపూర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేసులో పూజ హెగ్డే ముందు వరుసలో కనిపిస్తుంది. పూజ హెగ్డే ఉందంటే ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఇక్కడ బలపడిపోయింది. దాంతో దర్శక నిర్మాతలు ఆమె ఎంత పారితోషికం అడిగినా వెనుకాడటం లేదు. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధేశ్యామ్' రెడీ అవుతోంది.

ఈ సినిమా తరువాత ఆమె త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఆమెతో 'యానిమల్' అనే బాలీవుడ్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ట్రై చేస్తున్నాడట. రణ్ బీర్ కపూర్ - పరిణీతి చోప్రా ఈ సినిమాలో నాయకా నాయికలుగా కనిపించనున్నారు.

మనిషి జంతువులా ప్రవర్తిస్తే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో మాస్ ఐటమ్ నెంబర్ ను పూజ చేస్తే బాగుటుందని భావించి ఆమెను సంప్రదించారట. మరి పూజ హెగ్డే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.  
Ranbir Kapoor
Anil kapoor
Parineethi Chopra
Animal Movie

More Telugu News