Andhra Pradesh: ఏపీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు!

  • మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు 
  • మార్చి 4 లేదా 7వ తేదీన సమావేశాలను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం
  • కొత్త జిల్లాల బిల్లులను ప్రవేశ పెట్టనున్న సర్కార్
AP Budget sessions to start from march 1st week

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి తొలి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 4వ తేదీ లేదా 7వ తేదీన సమావేశాలను ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కొత్త రాజధాని, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలనను ప్రారంభించాలని యోచనలో ప్రభుత్వం ఉంది. ఉగాదికి రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఈలోగానే కొత్త జిల్లాల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పొందడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు ఈ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకాకపోవచ్చు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని గత సమావేశాల్లో ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News