తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
- ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు మొదలు
- ప్రాక్టికల్స్ మాత్రం మార్చి 23 నుంచే
- మే 10తో ముగియనున్న పరీక్షలు
ప్రాక్టికల్స్ మాత్రం మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 11న ఫస్టియర్ విద్యార్థులకు నైతికత, మానవీయ విలువలు, 12న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మే 2 నాటికి, సెకండియర్ విద్యార్థులకు అదే నెల 5వ తేదీ నాటికి పరీక్షలు పూర్తవుతాయి. అన్ని పరీక్షలు అదే నెల 10న ముగిస్తాయి.