Raghurama: నావల్ల కాదు నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ అనాలి... అప్పుడే నా రాజీనామా: రఘురామకృష్ణరాజు

Raghurama talks about resignation issue
షార్ట్స్‌లో చూడండి
వైసీపీతో ఎంపీ రఘురామకృష్ణరాజు పోరాటం కొనసాగుతోంది. ఆయనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి ఆయన రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రఘురామ స్పందించారు. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

అయితే, తనపై అనర్హత వేటుకు ఈ నెల 11 వరకు వైసీపీ నేతలకు సమయం ఇచ్చానని వెల్లడించారు. ఒకవేళ... ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ చెబితే అప్పుడు రాజీనామా చేస్తానని రఘురామ వివరించారు. రాజీనామా విషయంలో తాను స్పష్టతతోనే ఉన్నానని ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Raghurama
Resignation
YSRCP
CM Jagan
Andhra Pradesh

More Telugu News