CM KCR: హెలికాప్టర్ లో యాదాద్రి క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్

CM KCR aerial view on Yadadri Temple
  • యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
  • 3 నిమిషాల పాటు ఏరియల్ వ్యూ
  • బాలాలయంలో స్వామివారి దర్శనం
  • కేసీఆర్ కు పూర్ణకుంభ స్వాగతం
  • కాలినడకన ఆలయాన్ని పరిశీలించిన సీఎం
సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. హెలికాప్టర్ లో 3 నిమిషాల పాటు యాదాద్రి క్షేత్రాన్ని పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రధాన ఆలయం, యాగస్థలం, పుష్కరిణి, క్షేత్రంలోని రహదారులను పరిశీలించారు.

అనంతరం యాదాద్రి బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాగా, సీఎం కేసీఆర్ కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలన జరిపారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు.
CM KCR
Aerial View
Yadadri Temple
Telangana

More Telugu News