Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్!

Akshay Kumar appointed as Uttarakhand brand ambassador
  • ఉత్తరాఖండ్ లో షూటింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్
  • ఈ ఉదయం సీఎం పుష్కర్ సింగ్ ను కలిసిన అక్షయ్
  • బ్రాండ్ అంబాసడర్ గా ఉండాలని కోరిన సీఎం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ వెల్లడించారు. ఈ ఉదయం డెహ్రాడూన్ లోని సీఎం నివాసానికి అక్షయ్ కుమార్ వెళ్లారు.

ఈ సందర్భంగానే సీఎం కీలక ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ పని చేస్తారని ఆయన చెప్పారు. బ్రాండ్ అంబాసడర్ గా ఉండాలని తాము అక్షయ్ ని కోరామని... తమ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారని తెలిపారు.

మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి సీఎంకు అక్షయ్ కుమార్ గుడ్ లక్ చెప్పారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తరాఖండ్ లో ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా అక్షయ్ కు ఉత్తరాఖండ్ సంప్రదాయబద్ధమైన టోపీని, మెమెంటోను సీఎం బహూకరించారు.
Akshay Kumar
Bollywood
Uttarakhand
Brand Ambassador

More Telugu News