Rahul Gandhi: రాహుల్ గాంధీ వర్చువల్ ర్యాలీకి ఆదరణ.. లైవ్ ద్వారా 11 లక్షల మంది వీక్షణ

Rahul Gandhis virtual rally watched by over 11 lakh people
  • సోషల్ మీడియా వేదికలపై ప్రసారం
  • లైవ్ లో 90 వేల మంది
  • ఫేస్ బుక్ పేజీ నుంచి 8.8 లక్షల మంది
  • కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ప్రకటన
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన వర్చువల్ ర్యాలీకి మంచి ఆదరణ లభించింది. ‘ఆవాజ్ పంజాబి ది’ పేరుతో లుధియానా నుంచి రాహుల్ గాంధీ నిర్వహించిన వర్చువల్ ర్యాలీని 11 లక్షల మంది చూశారు. లైవ్ లో 90,000 మంది చూసినట్టు, రాహుల్ గాంధీ ఫేస్ బుక్ పేజీ నుంచి 8.8 లక్షల మంది సభను వీక్షించినట్టు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రకటించింది.

రాహుల్ గాంధీ పేస్ బుక్ పేజీలో 42,000 కామెంట్లు వచ్చాయి. 6,000 మంది షేర్ చేసుకోగా, 11 లక్షల మందిని ఇది చేరుకున్నట్టు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం తెలిపింది. ఈ సభను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేశారు. పంజాబ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫేస్ బుక్ లైవ్ పై 90,000 వ్యూస్ అన్నవి చాలా ఎక్కువగా కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
Rahul Gandhi
virtual rally
ludhiana
punjab
Social Media

More Telugu News