Anantapur District: అనంతపురం జేఎన్‌టీయూలో జూనియర్లను వేధించిన 18 మంది సీనియర్లపై సస్పెన్షన్ వేటు!

18 senior students suspended after Raging two juniors
  • ఇద్దరు విద్యార్థులను హాస్టల్ గదులకు తీసుకెళ్లి ర్యాగింగ్
  • విద్యార్థుల ఫిర్యాదుతో విచారణ
  • నిజమేనని తేలడంతో సస్పెన్షన్ 
అనంతపురం జేఎన్‌టీయూలో జూనియర్లను వేధించిన 18 మంది సీనియర్లను సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపల్ సుజాత తెలిపారు. శుక్రవారం రాత్రి ఇద్దరు జూనియర్ విద్యార్థులను సీనియర్లు తమ వసతిగృహంలోని గదులకు తీసుకెళ్లారు. అక్కడ వారిని అర్ధనగ్నంగా నిలబెట్టారు. తాము చెప్పిన పని చేయాలని బెదిరించినట్టు సమాచారం.

బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ నిజమేనని తేలడంతో 18 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. కాగా, యూనివర్సిటీలో ఉన్నతాధికారులు, పోలీసులు, వసతి గృహాల వార్డెన్లతో ర్యాగింగ్ నిరోధక కమిటీ ఉన్నప్పటికీ ర్యాంగ్ ఘటనలు వెలుగు చూస్తుండడం గమనార్హం.
Anantapur District
JNTU
Raging
Students

More Telugu News