Russia: రష్యా, బ్రెజిల్ లో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితి ఇదీ..!

Russia sees record surge in Covid cases
  • రష్యాలో పది రెట్లు పెరిగిన కేసులు
  • బ్రెజిల్ లో అత్యధిక మరణాలు
  • టీకాలు తీసుకోని వారిలో తీవ్రత
కరోనా తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా.. కొన్ని దేశాల్లో దీని తీవ్రత కొనసాగుతూనే ఉంది. రష్యా, ఇజ్రాయెల్, బ్రెజిల్ లో కేసులు గరిష్ఠాల్లోనే ఉంటున్నాయి.

రష్యాలో ఆదివారం 1,89,071 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల క్రితంతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ముందు రోజుతో చూసినా 2,800 కేసులు ఎక్కువ వచ్చాయి. బ్రిటన్ 54,095 కొత్త కేసులు వచ్చినట్లు ప్రకటించింది. 75 మరణాలు నమోదయ్యాయి.

ఇజ్రాయెల్ లో కరోనాతో ఐసీయూలో చేరిన తీవ్ర కేసుల సంఖ్య 1,263గా ఉంది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటుగా అక్కడి ఆరోగ్య శాఖ చెబుతోంది. టీకాలు తీసుకోని వారిలోనే సీరియస్ కేసులు బయటపడుతున్నట్లు పేర్కొంది. కొత్తగా 37,985 కేసులు అక్కడ వెలుగు చూశాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు 29 శాతంగా ఉంది.

కెనడాలో కొత్తగా 4,277 కేసులు వెలుగుచూడగా, 62 మంది మరణించారు. బ్రెజిల్ లో 60వేల కొత్త కేసులు రాగా, 391 మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో 77,029 కేసులు వెలుగు చూశాయి. 229 మంది మరణించారు. యూరప్ లో బ్రిటన్ తర్వాత అత్యధిక మరణాలు ఇటలీలో నమోదయ్యాయి.
Russia
hospitalisations
corona cases
Israel
Brazilc

More Telugu News