Pawan Kalyan: రామానుజాచార్యులు సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan attends to Ramanujacharyulu Thousand Years Celebrations
  • ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసిన పవన్
  • సమతామూర్తి విగ్రహ సందర్శన
  • పవన్ ను సత్కరించిన చిన్నజీయర్ స్వామి
  • ఆశీస్సులు అందుకున్న జనసేనాని
ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో జరుగుతున్న శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమతామూరి విగ్రహాన్ని సందర్శించారు. అంతేకాదు, విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను కూడా దర్శించి పూజలు చేశారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు.

తమ ఆశ్రమానికి వచ్చిన జనసేన పార్టీ అధినేతను చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఆశ్రమ విశేషాలను, సహస్రాబ్ది ఉత్సవ వివరాలను తెలిపారు. ఆపై పవన్ ప్రసంగిస్తూ, సమానత్వంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

పవన్ రాకతో ఆశ్రమంలోనూ కోలాహలం నెలకొంది. ఆయనను చూసేందుకు, ప్రసంగం వినేందుకు భారీగా తరలివచ్చారు. కాగా, ఆశ్రమ సందర్శనకు పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా విచ్చేశారు.
Pawan Kalyan
Ramanujacharyulu
Muchintal
Chinna Jeeyar Swamy
Hyderabad

More Telugu News