వేధింపుల కేసులో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట

06-02-2022 Sun 15:42
  • నటి శ్రీసుధతో శ్యామ్ సహజీవనం
  • పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడన్న శ్రీసుధ
  • అప్పట్లో ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు నమోదు
  • శ్యామ్ కు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన శ్రీసుధ
  • శ్రీసుధ పిటిషన్ కొట్టివేత
Supreme Court dismiss petition against cinematographer Shyam K Naidu
గతంలో సినీ నటి భీమిరెడ్డి శ్రీసుధతో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు సహజీవనం చేయగా, ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరిట ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ అప్పట్లో హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును శ్రీసుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ కె నాయుడు ద్వారా తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... శ్రీసుధ పిటిషన్ ను కొట్టివేసింది. బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.