రాహుల్ గాంధీ ఎన్నికలప్పుడే హిందువుగా మారతారు: బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్
- దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి
- ఉత్తరాఖండ్ లో ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ
- గంగానదికి పూజలు
- ఎద్దేవా చేసిన తేజీందర్ పాల్ సింగ్ బగ్గా
అయితే, బీజేపీ నేత తేజీందర్ పాల్ సింగ్ బగ్గా దీనిపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సరిగ్గా ఎన్నికలప్పుడే హిందువులా మారతారని వ్యంగ్యం ప్రదర్శించారు. రాహుల్ ఓ ఎన్నికల హిందువు అని అభివర్ణించారు. కాబట్టే రాహుల్ హారతి ఇస్తుండగా పూజారి సూచనలు చేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా బగ్గా సోషల్ మీడియాలో పంచుకున్నారు.