Rohit Sharma: నేను, శిఖర్ జట్టుకు దూరంగా ఉండాలని చెబుతున్నారా?: విలేఖరిని ప్రశ్నించిన రోహిత్ శర్మ

  • 2013 నుంచి ఓపెనింగ్ ఆర్డర్ మారలేదు
  • దీన్ని మార్చి యువతకు అవకాశాలు ఇస్తారా?
  • ప్రశ్నించిన విలేఖరి
  • సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవకాశాలు
  • బదులిచ్చిన రోహిత్
So you are saying Shikhar and I should be out of the team

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన హాస్య చతురతను చాటుకున్నారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఆయన భిన్నంగా స్పందిస్తుంటారు. తన జవాబులతో అక్కడున్న వారిని నవ్విస్తుంటారు. వెస్టిండీస్ తో భారత్ మొదటి వన్డే మ్యాచ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోనుంది. భారత్ కు ఇది 1,000 వన్డే అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు.

‘‘యువ క్రికెటర్లకు భారత్ గతంలో ఎన్నో అవకాశాలు ఇవ్వడం చూశాం. 2013 నుంచి భారత జట్టు టాప్-3 స్థానాలు అలానే ఉంటున్నాయి. మార్పునకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నారా? యువతకు ఎక్కువ అవకాశాలు ఇద్దామనుకుంటున్నారా?’’ అంటూ  మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.

రోహిత్ స్పందిస్తూ.. ‘‘అంటే నేను, శిఖర్ ధావన్ జట్టుకు దూరంగా ఉండాలని, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ తో ఆట మొదలు పెట్టాలని మీరు చెబుతున్నారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను, శిఖర్ ధావన్ ఆటను ఆరంభించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. నేను, ధావన్, కోహ్లీ మంచి ప్రదర్శన ఇచ్చాం. నిజమే యువ ప్లేయర్లు అవకాశాలు పొందాలి. ఇషాన్ మాదిరే వారికీ అవకాశాలు వస్తాయి. ఎన్నో మ్యాచులు రానున్నాయి. వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయి’’అని రోహిత్ శర్మ వివరించాడు.

ఎప్పుడూ అదే ప్యాటర్న్ కొనసాగదని, సమయం వచ్చినప్పుడు యువ క్రీడాకారులు ఆ అవకాశం సొంతం చేసుకుంటారని రోహిత్ తెలిపాడు.

More Telugu News