Kuppam Prasad: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆగ్రహం

  • ఏపీలో చింతామణి నాటకంపై నిషేధం
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎంపీ రఘురామ
  • సుబ్బిశెట్టి పాత్రను వికృతంగా చిత్రీకరిస్తున్నారన్న కుప్పం ప్రసాద్
  • దీనికి రఘురామ ఏంచెబుతారంటూ నిలదీసిన వైనం
AP Arya Vaisya Corporation Chairman fires on MP Raghurama

ఇటీవల ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడం తెలిసిందే. ఆర్యవైశ్య సంఘాల డిమాండ్ ను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చింతామణి నాటకాన్ని నిషేధించడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో, రఘురామపై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతామణి నాటకంలో వికృతంగా డబుల్ మీనింగ్ డైలాగులతో సుబ్బిశెట్టి పాత్రను చిత్రీకరిస్తున్నారని కుప్పం ప్రసాద్ ఆరోపించారు. దీనిపై ఆర్యవైశ్యులకు ఎంపీ రఘురామ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర తీసివేసి, పేరు మార్చుదామని ఎంపీ రఘురామ చెప్పడం విడ్డూరంగా ఉందని కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు.

ఆర్యవైశ్యులు మీ జోలికి రాలేదు... మా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోం అని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవించి ఎంపీ రఘురామ తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News