TRS: ప్రధాని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లాల్సిన అవసరంలేదు: టీఆర్ఎస్ పార్టీ

  • హైదరాబాదు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ
  • ఎయిర్ పోర్టుకు వెళ్లని సీఎం కేసీఆర్
  • మండిపడుతున్న బీజేపీ నేతలు
  • చవకబారు రాజకీయాలు చేయొద్దన్న టీఆర్ఎస్ పార్టీ
TRS Party clarifies on protocol row

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనకు రాగా, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ స్పష్టత నిచ్చింది.

 అనారోగ్యం కారణంగానే సీఎం ఎయిర్ పోర్టుకు వెళ్లలేకపోయారని వెల్లడించింది. అయితే, ప్రధాని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లాల్సిన అవసరంలేదని కూడా తేల్చి చెప్పింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ సైతం ఇదే చెబుతోందని వివరించింది.

దీనిపై బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదని టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి ఘటనలపై చవకబారు రాజకీయాలు చేయొద్దని బీజేపీ నేతలకు హితవు పలికింది. అంతేకాదు, ప్రోటోకాల్ విధివిధానాలకు సంబంధించిన ఆధారాలను కూడా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

More Telugu News