Hey Sinamika: మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హే సినామిక'

Hey Sinamika set to release on March third
  • దుల్కర్ సల్మాన్, కాజల్, అదితిరావు హైదరీ నటించిన చిత్రం
  • బృందా గోపాల్ దర్శకత్వంలో 'హే సినామిక'
  • కొరియోగ్రాఫర్ నుంచి దర్శకురాలిగా మారిన బృందా
  • ఏకకాలంలో నాలుగు భాషల్లో రిలీజవుతున్న చిత్రం
దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ నటించిన చిత్రం 'హే సినామిక'. కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హే సినామిక చిత్రం మార్చి 3న థియేటర్లలో రిలీజ్ అవుతుందని చిత్రబృందం నేడు వెల్లడించింది. అదే రోజున తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అవుతోందని తెలిపింది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. హే సినామిక చిత్రానికి తమిళ గీత రచయిత మదన్ కార్కీ కథ అందించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు.
Hey Sinamika
Release
Dulquer Salmaan
Kajal Aggarwal
Aditirao
Brinda Gopal

More Telugu News