Kiran Abbavaram: ఆసక్తిని రేపుతున్న 'సెబాస్టియన్' టీజర్!

  • విభిన్నమైన కథాంశంతో 'సెబాస్టియన్'
  • కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ అబ్బవరం
  • మదనపల్లి నేపథ్యంలో జరిగే కథ
  • ఈ నెల 25వ తేదీన విడుదల
Sebastian teaser released

యువ కథానాయకులలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం చాలా స్పీడ్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ఓ మూడు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయన తాజా చిత్రంగా 'సెబాస్టియన్ PC 524' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. మదనపల్లిలోని ఒక పోలీస్ స్టేషన్ కి కానిస్టేబుల్ గా 'సెబాస్టియన్' వస్తాడు. అదే అతని మొదటి పోస్టింగ్. అయితే అతనికి రేచీకటి ఉంటుంది. ఆ విషయం ఎవరికీ తెలియనీయవద్దని తల్లి చెప్పిన మాటలు ఆయనలో బలంగా నాటుకుంటాయి.

పోలీస్ స్టేషన్ లో రాత్రివేళలో డ్యూటీ పడినప్పుడు ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ. గిబ్రాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కిరణ్ అబ్బవరం జోడీగా నువేక్ష .. కోమలి ప్రసాద్ తెలుగు తెరకి కథానాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

  • Loading...

More Telugu News