తెలంగాణ అసెంబ్లీ ముందు రోడ్డు ప్రమాదం.. ఉద్యోగి మృతి!

Govt employee dead in road accident in Hyderabad
  • ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కింద పడ్డ ప్రభుత్వ ఉద్యోగి
  • అక్కడికక్కడే మృతి చెందిన ఉద్యోగి
  • మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ లోని అసెంబ్లీ ముందు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మురళీకృష్ణ అనే ప్రభుత్వోద్యోగి స్కూటీ మీద వెళ్తూ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మురళీకృష్ణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Hyderabad
Road Accident

More Telugu News