Ministers: ఉద్యోగులతో కొనసాగుతున్న సమావేశం... కొత్త ప్రతిపాదనలు చేసిన మంత్రుల కమిటీ!

Ministers Committee makes new proposals to Employees
  • సచివాలయంలో ఉద్యోగులతో మంత్రుల కమిటీ భేటీ
  • హెచ్ఆర్ఏ శ్లాబులపై ఆసక్తికర ప్రతిపాదనలు
  • ఫిట్ మెంట్ మాత్రం 23 శాతమేనంటున్న కమిటీ
  • ఐఆర్ రికవరీ చేయబోమని వెల్లడి!
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ హెచ్ఆర్ఏ శ్లాబులకు సంబంధించి ఉద్యోగుల ముందు కొత్త ప్రతిపాదనలు ఉంచింది.

  • 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్ తో 8 శాతం హెచ్ఆర్ఏ
  • 2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్ తో 9.5 శాతం హెచ్ఆర్ఏ
  • 5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్ తో 13.5 శాతం హెచ్ఆర్ఏ
  • 10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్ తో 16 శాతం హెచ్ఆర్ఏ
  • సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్ తో 24 శాతం హెచ్ఆర్

ఇక, ఫిట్ మెంట్ మాత్రం 23 శాతం మాత్రమే ఇస్తామని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసింది. ఐఆర్ రికవరీ చేయబోమని తెలిపింది. ఐదేళ్లకు ఓసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సానుకూల భావన వ్యక్తం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాతే కొత్త పీఆర్సీ వేతనాలు ఇవ్వాలని భావిస్తున్నారు. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
Ministers
Employees
Talks
New Proposals
Andhra Pradesh

More Telugu News