Pratap C Reddy: అపోలో ప్రతాప్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, చంద్రబాబు

CM Jagan wishes Apollo founder Pratap C Reddy on his birthday
  • నేడు ప్రతాప్ సి రెడ్డి పుట్టినరోజు
  • 91వ జన్మదినం జరుపుకుంటున్న వైనం
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి నేడు 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆరోగ్య రంగానికి పితామహుడు అనదగ్గ రీతిలో గౌరవనీయ స్థానం సంపాదించుకున్న వ్యక్తి ప్రతాప్ సి రెడ్డి అని కొనియాడారు. అంతేకాకుండా, దేశ ఆధునిక ఆరోగ్య రంగానికి రూపశిల్పిగా నిలిచే వ్యక్తి అని కితాబునిచ్చారు. ఆయనకు భగవంతుడు సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

కాగా, అపోలో ప్రతాప్ రెడ్డికి టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మందికి ప్రపంచస్థాయి ఆరోగ్య సదుపాయాలు అందబాటులోకి తీసుకురావడంలో ఆద్యుడు ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు సేవల చేయడం కోసం ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 
Pratap C Reddy
Birthday
CM Jagan
Wishes
Apollo

More Telugu News