Jaya Bachchan: జయబచ్చన్ కు కరోనా పాజిటివ్

Jaya Bachchan tests positive for Corona Virus
  • జయకు కరోనా సోకినట్టు ప్రకటించిన బీఎంసీ అధికారి
  • హోం ఐసొలేషన్ లో ఉన్న జయ
  • ఆగిపోయిన 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' సినిమా షూటింగ్
సీనియర్ సినీ నటి, రాజ్యసభ సభ్యురాలు జయబచ్చన్ కరోనా బారిన పడ్డారు. జయ కరోనా బారిన పడినట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. జయ కరోనా బారిన పడటంతో ఆమె నటిస్తున్న 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' చిత్రం షూటింగ్ ను ఆపేశారు.

కరణ్ జొహార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్ ప్రీతి జింటా, ధర్మేంద్ర, షబానా అజ్మీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలే షబానా అజ్మీ కూడా కరోనా బారిన పడ్డారు. మరోవైపు గత ఏడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కరోనా బారిన జయ పడలేదు. ఇప్పుడు మాత్రం ఆమె ఒక్కరే కరోనా బారిన పడగా... మిగిలిన కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
Jaya Bachchan
Corona Virus
Bollywood

More Telugu News