Ministers Committee: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభం

Ministers Committee held meeting with employees leaders
  • డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు
  • మళ్లీ చర్చల ప్రక్రియ షురూ
  • కీలక అంశాలపై నేటి సమావేశంలో చర్చ
  • సీఎం సమక్షంలో నిర్ణయాలు ప్రకటించే అవకాశం
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. తాజాగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్ఆర్ఏ శ్లాబులు, ఐఆర్ రికవరీ, ఇతర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాగా, ఈ భేటీ ద్వారా ఇరువర్గాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంత్రుల కమిటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లనుంది. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన కీలక నిర్ణయాలను సీఎం సమక్షంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.
Ministers Committee
Employees Unions
Meeting
CM Jagan
Andhra Pradesh

More Telugu News