Aditi Shankar: 'గని' చిత్రంలో పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కుమార్తె

  • వరుణ్ తేజ్ హీరోగా గని
  • రోమియో జూలియట్ పాటపాడిన అదితి శంకర్
  • వైద్య విద్య పూర్తిచేసుకున్న అదితి
  • కార్తీ పక్కన హీరోయిన్ గానూ నటిస్తున్న వైనం
Top director Shankar daughter sung for Gani

దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె అదితి బహుముఖ ప్రజ్ఞావంతురాలు అనిపించుకుంటోంది. వైద్య విద్యను పూర్తిచేసిన అదితి శంకర్ తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న 'విరుమాన్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

కాగా, అదితి మంచి గాయని కూడా. ఆమె తెలుగులో తమన్ సంగీత దర్శకత్వంలో ఓ పాట పాడడం విశేషం. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ గీతాన్ని అదితితో పాడించారు. ఈ పాటను ఈ నెల 8న విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో తమన్ ఆవిష్కరించనున్నారు. అదితి తమిళనాడులోని శ్రీ రామచంద్ర మెడికల్ ఇన్ స్టిట్యూట్ లో వైద్య విద్య అభ్యసించింది.

More Telugu News