Nuclear Reactor: శ్రీకాకుళంలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు... ఏపీ కరెంటు కష్టాలు తీరతాయన్న విజయసాయిరెడ్డి

Nuke power reactors to be set up in Srikakulam District
  • రాజ్యసభలో ప్రశ్న అడిగిన విజయసాయి
  • కేంద్రం లిఖితపూర్వక సమాధానం
  • ఒక్కొక్క రియాక్టర్ సామర్థ్యం 1,208 మెగావాట్లు

ఏపీ కరెంటు కష్టాలు త్వరలో తీరనున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయి పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన 6 రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి వివరించారని తెలిపారు. అయితే ఇవి దేశీయంగా తయారైన రియాక్టర్లు కాకపోయినప్పటికీ, రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చుతాయన్న నమ్మకం ఉందని విజయసాయి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News