aprtc: రేపు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మె: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు

  • ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో ఏపీలో నిర‌స‌న‌లు
  • ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినా సమస్యలు పరిష్కారం కాలేదు
  • అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించింది: ఆర్టీసీ ఉద్యోగులు
  • చిత్తూరు జిల్లాలో15 డిపోల వ‌ద్ద‌ ఉద్యోగుల నిరసన
will stop ap rtc bus services says jac

ఏ క్షణం నుంచైనా స‌రే స‌మ్మెకు దిగేందుకు తాము ముందు నుంచే సిద్ధంగా ఉన్నామ‌ని ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌క‌టించారు. ఆర్టీసీ జేఏసీ అధ్వర్యంలో ఏపీలో వారి నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. రేపు అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెకు దిగాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు.  

తిరుపతిలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో సెంట్రల్ బస్టాండు వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిర‌స‌న తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు.

త‌మ‌కు ఉండాల్సిన‌ అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందని అన్నారు. ప్ర‌భుత్వంలో విలీనం జరిగిందని ఆనందపడాలో లేక‌ ఉన్న వసతులు పోయినందుకు బాధ‌ప‌డాలో అర్థం కావ‌ట్లేద‌న్నారు. చిత్తూరు జిల్లాలో 15 డిపోల వ‌ద్ద‌ ఉద్యోగుల నిరసన జరుగుతోందని తెలిపారు.

More Telugu News