Ashwini Vaishnaw: విపక్షాలు కలిసొస్తే సోషల్ మీడియా ఖాతాల పట్ల కఠిన వైఖరి: కేంద్రం

  • ఏకాభిప్రాయం అవసరం
  • మహిళల గౌరవాన్ని కాపాడడంలో రాజీలేదు
  • రాజ్యసభలో మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటన 
IT minister for stricter checks on social media seeks consensus in Parliament

సోషల్ మీడియాను మరింత జవాబుదారీ చేస్తూ కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. కాకపోతే ఇందుకు రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని పేర్కొంది. మహిళల గౌరవాన్ని కాపాడే విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు మంత్రి అశ్వని వైష్ణవ్ స్పందించారు.

బుల్లీ భాయ్, సుల్లీ డీల్స్ యాప్స్ కు వ్యతిరేకంగా వెంటనే కఠిన చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ యాప్స్ లో మస్లిం మహిళల ఫొటోలను వేలానికి పెట్టడం తెలిసిందే. ‘‘సోషల్ మీడియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటే, భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ ప్రతిపక్షం మమ్మల్ని నిందిస్తుంది. అది నిజం కాదు. ఇలాంటి అంశాల్లో తటస్థంగా వ్యవహరించాలి’’ అని అశ్వని వైష్ణవ్ అన్నారు.

‘మోసపూరిత సందేశాలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ’ కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. సామాజిక మీడియాను జవాబుదారీ చేస్తూ పలు చర్యలు ఇప్పటికే తీసుకున్నట్టు ప్రకటించారు. సభలో ఏకాభిప్రాయం వస్తే మరింత కఠినమైన నిబంధనలు తీసుకొస్తామని చెప్పారు.

More Telugu News