Narendra Modi: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Prime minister Narendra Modi today visits Hyderabad
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని
  • ముచ్చింతల్‌లోని రామానుజాచార్య విగ్రహావిష్కరణ
  • పర్యటన మొత్తం ప్రధాని వెంటనే కేసీఆర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్ చేరుకుని రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే దాదాపు మూడు గంటలపాటు ఉంటారు.

ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ ఆయన వెంటే ఉంటారు. ప్రధాని పర్యటన బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి తోమర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటించే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
Narendra Modi
KCR
Hyderabad

More Telugu News