Alia Bhatt: 'గంగూబాయి' తెలుగు ట్రైలర్ రిలీజ్!

  • 'గంగూబాయి'గా అలియా భట్
  • 'కామాటిపుర' నేపథ్యంలో సాగే కథ
  • అతిథి పాత్రలో అజయ్ దేవగణ్
  • ఈ నెల 25వ తేదీన విడుదల  
Gangubai telugu trailar released

ముంబైలోని 'కామాటిపుర' నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు 'గంగూబాయి కతియవాడి' సినిమా రూపొందింది. సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. జయంతిలాల్ గడ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను అలియా భట్ పోషించింది.

'గంగూబాయి' టైటిల్ జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లిపోయింది. అలియా డిఫరెంట్ లుక్ కూడా అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీని ఖరారు చేసుకుంది. హిందీతో పాటు తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గంగూబాయిగా అలియా బాడీలాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తమ జీవితాలను .. పిల్లల భవిష్యత్తును మార్చడానికి ఆమె చేసే పోరాటమే ఈ కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ .. హుమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News