Nagababu: ఉద్యోగులతో శాంతియుత చర్చల దిశగా చొరవ చూపండి: సీఎం జగన్ కు నాగబాబు సూచన

  • నిన్న ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం 
  • ఉద్యోగులకు మద్దతు పలికిన పవన్
  • జీతాలను తగ్గించడం అనేది గుండెను పిండేస్తోందన్న నాగబాబు  
  • ఉద్యోగుల సమస్యను సత్వరం పరిష్కరించాలని మనవి 
Nagababu asks CM Jagan takes swift measures to resolve employees problems

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించడం తెలిసిందే. ఆయన ఉద్యోగులకు మద్దతు పలికారు. పలు అంశాల్లో ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు కూడా స్పందించారు.

"ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగులు ఎంతటి చిన్నవారైనా కావొచ్చు... కానీ జీతాల్లో పెరుగుదల, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు అనేవి ఆ వేతన జీవులకు చిరు ఆశాకిరణాల వంటివి. మా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పినట్టు... ఆ చిన్న ఆశలను కూడా ఉద్యోగులకు అందకుండా చేయడం, ఉన్న జీతాలను తగ్గించడం అనేది గుండెను పిండేస్తోంది. ఈ నేపథ్యంలో నేను కోరేది ఏంటంటే... ఉద్యోగులతో శాంతియుత చర్చలకు ఏపీ సీఎం జగన్ చొరవ చూపాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News