Face Mask: కరోనాపై పోరుకు క్రిమిసంహారక మాస్క్ తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు

  • కరోనా సమయంలో మాస్కులకు డిమాండ్
  • వినూత్న మాస్క్ ను అభివృద్ధి చేసిన కేంద్ర సంస్థలు
  • మాస్కుకు రాగి ఆధారిత నానో పార్టికల్ పూత
  • వైరస్ లు, బ్యాక్టీరియాలను అడ్డుకునే సామర్థ్యం
Indian scientists develops new copper based face mask to fight with corona

కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన తరుణంలో నివారణోపాయాలపై ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ పరిశోధకులు వినూత్నమైన మాస్క్ ను అభివృద్ధి చేశారు. ఇది క్రిమిసంహారక మాస్క్. ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా క్రిములను చంపగల సత్తా ఈ మాస్క్ సొంతం. మానవాళికి ముప్పుగా మారిన కొవిడ్ వైరస్ ను ఇది అత్యంత సమర్థంగా ఎదుర్కొంటుందని పరిశోధనలో వెల్లడైంది. పైగా ఈ మాస్కులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని, భూమిలో సులువుగా కలిసిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ మాస్కుపై రాగి ఆధారిత నానో పార్టికల్ పూత పూస్తారు. తద్వారా వైరస్ లు ఈ పొరను దాటుకుని రావడం కష్టతరమవుతుంది. ఈ మాస్కు ధరిస్తే శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కాగా, ఈ రాగి ఆధారిత మాస్కు తయారీలో ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సీఐ), సీఎస్ఐఆర్, సీసీఎంబీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ అనే ప్రైవేటు సంస్థ కూడా పాలుపంచుకుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రాయోజిత నానో మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ సరికొత్త మాస్కు అభివృద్ధి చేశారు.

More Telugu News