KIA: లక్ష మార్కు దాటిన కియా కార్ల ఎగుమతులు

  • భారత్ లో టాప్-5లో కియా
  • ఎగుమతుల్లోనూ దూసుకెళుతున్న కొరియా దిగ్గజం
  • 2019 నుంచి 1,01,734 కార్ల ఎగుమతి
  • సెల్టోస్, సోనెట్ మోడళ్లకు విదేశాల్లో గిరాకీ
KIA Cars exports crosses one lakh mark

మూడేళ్ల కిందట భారత్ లో ప్రస్థానం ఆరంభించిన దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా ప్రస్తుతం టాప్-5 అమ్మకందార్లలో ఒకటిగా ఉంది. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటు చేసిన ప్లాంట్ లో కార్ల తయారీ చేపడుతున్న కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (కెఐపీఎల్) ఎగుమతుల్లోనూ దూసుకుపోతోంది.

ఇప్పటివరకు కియా ఎగుమతి చేసిన కార్ల సంఖ్య లక్ష మార్కు దాటింది. 2019లో భారత్ నుంచి కార్ల ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి 2022 జనవరి వరకు 1,01,734 కార్లను ఎగుమతి చేసింది.

భారత్ ను ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని కియా యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 91 దేశాలతో పాటు మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలకు సెల్టోస్, సోనెట్ మోడళ్లను ఎగుమతి చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు చేసిన ఎగుమతుల్లో సెల్టోస్ వాటా 77 శాతం కాగా, సోనెట్ మోడళ్ల వాటా 23 శాతం అని కియా ఇండియా విభాగం వివరించింది.

More Telugu News