Apple: యాపిల్ ఫోన్లలో మరింత భద్రత.. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్

  • ఆటోఫిల్ ఆప్షన్ కు పరిమితులు
  • ఒకే చిరునామాతో ఓటీపీ వస్తేనే
  • లేదంటే ఆటోఫిల్ కు అవకాశం ఉండదు
  • యూజర్ మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిందే
Apple to make OTPs safer for iPhone users

టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే రెండంచెల రక్షణ వ్యవస్థ. ఉదాహరణకు ఏదైనా వెబ్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యేందుకు.. పాస్ వర్డ్ తో పాటు మొబైల్ కు వచ్చే ఓటీపీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అధిక భద్రత ఇస్తుంది. యాపిల్ ఐఫోన్ యూజర్ల విషయంలో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ను అమలు చేస్తోంది.

ఐఫోన్ యూజర్లకు ఎస్ఎంఎస్ కోడ్ పంపించే విధానాన్ని మార్చుకోవాలంటూ యాపిల్ కంపెనీలను కోరినట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటో ఫిల్ ఆప్షన్ గురించి తెలిసే ఉంటుంది. ఫోన్ కు ఓటీపీ వచ్చినప్పుడు దాన్ని యూజర్ స్వయంగా టైప్ చేసే అవసరం లేకుండా సాఫ్ట్ వేర్ ఆ పనిచేస్తుంది.

కానీ, యాపిల్ ఫోన్లలో ఓటీపీ ఆటో ఫిల్ ఆప్షన్ పనిచేయాలంటే.. వెరిఫికేషన్ కోడ్, పంపించిన డొమైన్ చిరునామాతో రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు అమెజాన్.ఇన్ లో లాగిన్ కు ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీ అదే పోర్టల్ చిరునామాతో రావాలి. కానీ, అమెజాన్.సెక్యూర్ లాగిన్.కామ్ చిరునామాతో రాకూడదు. ఈ కొత్త ఫీచర్ తాజాగా యూజర్లకు దర్శనమిస్తోంది. ఫిషింగ్ దాడులకు అవకాశం ఇవ్వకుండా యాపిల్ ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

More Telugu News