Job Mela: విజయవాడలో జాబ్ మేళా... వివరాలు ఇవిగో!

  • ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ప్రకటన
  • ఎమ్ టార్ టెక్నాలజీస్ సంస్థలో ఉద్యోగాల భర్తీ
  • వెల్డర్, మైనింగ్ ఆపరేటర్ ఖాళీలు
  • ఫిబ్రవరి 4న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
  • రిజిస్ట్రేషన్ తప్పనిసరి
Huge job mela in Vijayawada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ) ఆధ్వర్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 4) నాడు విజయవాడలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎమ్ టార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడుతోంది. విజయవాడ ఆంధ్రా లయోలా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులు తమ రెజ్యూమే సహా విద్యార్హతల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఆంధ్రా లయోలా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రేపు (ఫిబ్రవరి 4) ఉదయం 9.30 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

అంతకంటే ముందు ఈ లింకు (https://apssdc.in/industryplacements/) ద్వారా తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ మేరకు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది.

ఉద్యోగ ఖాళీల వివరాలు....

టీఐజీ వెల్డర్ ఖాళీలు 75, సీఎన్జీ మైనింగ్ ఆపరేటర్ ఖాళీలు 75 ఉన్నాయి. వెల్డర్ ఉద్యోగానికి 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారు అర్హులు.  0-5 ఐదేళ్ల అనుభవం ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక, సీఎన్జీ మైనింగ్ ఆపరేటర్ ఉద్యోగాలకు కూడా పురుష అభ్యర్థుల నుంచే దరఖాస్తులు కోరుతున్నట్టు ఎమ్ టార్ టెక్నాలజీస్ తెలిపింది. మెకానికల్ ట్రేడ్ లో ఐటీఐ, డిప్లొమా చేసిన వారు సీఎన్జీ మైనింగ్ ఆపరేటర్ ఉద్యోగాలకు అర్హులు. వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సీఎన్జీ శిక్షణ పొంది ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News