Asaduddin Owaisi: యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు... క్షేమంగా బయటపడ్డ నేత

Firing on Asaduddin Owais car in Uttar Pradesh
  • ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మీరట్ జిల్లాలో ప్రచారానికి వెళ్లిన ఒవైసీ
  • కితౌర్ ప్రాంతంలో పర్యటన
  • ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఒవైసీ ఇవాళ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. అయితే తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ వెల్లడించారు. దుండగులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని తెలిపారు. చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా పంచుకున్నారు.

కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.
Asaduddin Owaisi
Car
Firing
Uttar Pradesh
MIM
Assembly Elections

More Telugu News