Tollywood: త్రివిక్రమ్ తో మహేశ్ మూడోసారి.. నమ్రత చేతుల మీదుగా సినిమా షురూ

Mahesh 28 With Trivikram Launched
  • రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం
  • ఏప్రిల్ నుంచి షూటింగ్ కు
  • కథానాయికగా పూజా హెగ్డే
  • కొత్త చాప్టర్ మొదలైందంటూ మహేశ్ ట్వీట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేశ్ బాబు మరోసారి జట్టు కడుతున్నాడు. తన 28వ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమం ఇవాళ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ చేతుల మీదుగా సినిమాను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆమె క్లాప్ కొట్టారు. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుంది. మహర్షి తర్వాత ఆమె మరోసారి మహేశ్ కు హీరోయిన్ గా కనిపించనుంది.

ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లో మొదలు కానుంది. సినిమాను హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు సమకూర్చనున్నాడు. సినిమాపై మహేశ్ కూడా కామెంట్ చేశాడు. మరో కొత్త చాప్టర్ మొదలైందంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ కు ‘అతడు’తో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐదేళ్లకు 2010లో ఇద్దరూ ‘ఖలేజా’ చిత్రంతో జట్టుకట్టారు. అయితే, బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. మ్యానరిజమ్స్, నటన విషయంలో మాత్రం మహేశ్ బాబు అందరి మన్ననలనూ పొందాడు. సినిమాలో కొత్తగా కనిపించాడు. ఇక, ఈ సినిమాలో మహేశ్ ను త్రివిక్రమ్ ఇంకెంత కొత్తగా చూపిస్తాడో తెలియాలంటే వేచి చూడాలి.
Tollywood
Mahesh Babu
Namrata Shirodkar
Pooja Hegde
Trivikram Srinivas

More Telugu News