MS Dhoni: ‘అథర్వ’గా ధోనీ.. కత్తి పట్టి శత్రుసంహారం.. ధోనీ హీరోగా వెబ్ సిరీస్ టీజర్ ఇదిగో

Dhoni As Atharva Here Is His First Web Series Teaser
  • యోధుడి పాత్ర పోషిస్తున్న మహీ
  • నటుడిగా కొత్త పాత్రలో పరకాయ ప్రవేశం
  • నవల ఆధారంగా గ్రాఫిక్స్ రూపంలో సిరీస్
  • నిర్మాణ సహకారం అందిస్తున్న ధోనీ
ఇన్నాళ్లూ బ్యాటు పట్టి బంతిని స్టేడియం దాటించిన అతడు.. కత్తి పట్టి శత్రుమూకలను తరిమికొడుతున్నాడు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా ప్రణాళికలు అమలు చేసిన అతడు.. ఇప్పుడు ఆగ్రహోదగ్రుడై కదన రంగంలో కాలుదువ్వి యుద్ధ తంత్రాలు అమలు చేస్తున్నాడు. అతడే మహేంద్ర సింగ్ ధోనీ. అవును, ధోనీనే. క్రికెటర్ గా, మెంటార్ గా, కెప్టెన్ గా ఎన్నో పాత్రలు పోషించిన అతడు.. ఇప్పుడు మరో కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు.

ధోనీ వెబ్ సిరీస్ లో మెరవబోతున్నాడు. ‘అథర్వ’గా శత్రువుల భరతం పట్టనున్నాడు. ‘అథర్వ– ది ఆరిజిన్’ పేరిట వెబ్ సిరీస్ ను చేస్తున్నాడు. అదే పేరుతో రాబోతున్న నవలనే గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన టీజర్ ను నిన్న రాత్రి విడుదల చేశారు. రెండు చేతుల్లో ఖడ్గాలను ఒడుపుగా పట్టి.. రాక్షస సంహారం చేస్తున్న యోధుడిగా మహీ అందులో కనిపించాడు.

ఆ ఫస్ట్ లుక్, టీజర్ ను ధోనీ తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో షేర్ చేశాడు. రమేశ్ తమిళ్ మణి అనే నవ రచయిత ఈ కథకు, మహీ పాత్రకు రూపమిచ్చాడు. ఇంకో విశేషమేంటంటే, ధోనీ ఎంటర్ టైన్మెంట్ పేరిట ధోనీ కూడా స్వయంగా దీనికి నిర్మాణ సహకారం అందిస్తున్నాడు. ఇంతకుముందు ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ధోనీ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించాడు. అయితే, ఇప్పుడు అథర్వగా స్వయంగా ధోనీనే అభిమానులను అలరించనుండడం విశేషం.

MS Dhoni
Tollywood
Bollywood
Cricket
Web Series

More Telugu News