'ఎఫ్ 3' ఫస్టు సింగిల్ రిలీజ్ కి డేట్ ఖరారు!

03-02-2022 Thu 11:28
  • పూర్తి వినోదభరితంగా సాగే 'ఎఫ్ 3'
  • డబ్బు చుట్టూ తిరిగే కథ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  • ఏప్రిల్ 28వ తేదీన విడుదల
F3 first single release on Feb 7th
వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.

'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ' అంటూ ఈ పాట సాగనుంది. గతంలో వచ్చిన 'ఎఫ్ 2' సినిమాలో తమని పట్టించుకోవడం లేదంటూ భార్యల పోరును చూపించారు. 'ఎఫ్ 3'లో డబ్బు సంపాదించడం లేదంటూ భర్తలను వేధిస్తుండటం ప్రధానంగా చూపించనున్నారు. ఆ నేపథ్యంలో వచ్చే పాటనే ఇది.

ఈ సినిమాలో వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జోడీలు అలాగే కనిపించనున్నాయి. కొత్తగా ఈ సినిమాలో జాయినైన ఆర్టిస్టుల జాబితాలో సునీల్ .. అంజలి .. సంగీత వున్నారు. పూర్తి వినోదభరితమైన ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.