వాట్సాప్ లో ‘మెస్సేజ్ రియాక్షన్స్’ ఫీచర్ త్వరలో

03-02-2022 Thu 10:46
  • అభివృద్ధి చేస్తున్న వాట్సాప్
  • చివరి దశకు చేరిక
  • ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, మెస్సెంజర్ లో ఈ ఫీచర్
WhatsApp to soon introduce Apple iMessage like message reactions
యాపిల్ ఫోన్లలో ఐ మెసేజ్ తరహా ‘మెస్సేజ్ రియాక్షన్స్’ ఫీచర్ త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తుండగా, ఇది తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఫీచర్ ను మెటా (ఫేస్ బుక్) ఇప్పటికే మెస్సెంజర్, ఇన్ స్టాగ్రామ్ లో ప్రవేశపెట్టింది.

ఇదే త్వరలో వాట్సాప్ లోనూ కనిపించనుంది. మెస్సేజ్ రియాక్షన్స్ లో యూజర్లు మెస్సేజ్ ను ట్యాప్, హోల్డ్ చేసి తమ స్పందన తెలియజేయవచ్చు. అక్కడ ఉండే ఎమోజీలలో ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీంతో ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా రిప్లయ్ ఇవ్వడం సాధ్యపడుతుంది. ఈ ఫీచర్ గురించి గతేడాదే సమాచారం బయటకు వచ్చింది. అభివృద్ధి దశ చివరికి వచ్చినట్టు తెలుస్తోంది.