Priyamani: కామెంట్లు పట్టించుకుంటూ కూర్చుంటే పనౌతుందా?: ప్రియమణి

Priyamani will not care about comments
  • నా దృష్టి ఎప్పుడూ కెరియర్ పైనే ఉంటుంది
  • నేను ఎప్పుడూ కూడా ఖాళీగా లేను
  • ఇప్పుడు నా కెరియర్ సంతృప్తికరంగా ఉంది
  • కామెంట్లు చదివే అలవాటే లేదన్న ప్రియమణి
తెలుగులో ప్రియమణి చాలా సినిమాలు చేసినప్పటికీ, భారీ విజయాన్ని సాధించి పెట్టిన సినిమాగా మాత్రం 'యమదొంగ' కనిపిస్తుంది. తెలుగులో జగపతిబాబు సరసన ఎక్కువ సినిమాలు చేసిన ఆమె, సెకండ్ ఇన్నింగ్స్ లో 'నారప్ప' సినిమా చేశారు. ఇక ఆ తరువాత ఆమె చేసిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఆమె 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం 'భామాకలాపం' అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, సెకండ్ ఇన్నింగ్స్ సంతృప్తికరంగా కొనసాగుతున్నట్టుగా చెప్పారు. "మొదటి నుంచి కూడా నేను నా కెరియర్ పైనే దృష్టి పెడుతూ వచ్చాను. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాలతోను బిజీగా ఉంటూ వచ్చాను.

2012 తరువాత నా కెరియర్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. అప్పుడు టీవీ షోస్ చేస్తూ వెళ్లాను. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లనే టీవీ షోలు చేస్తుందని కొంతమంది కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా యూ ట్యూబ్ చూడను .. కామెంట్లు చదవను .. వాటిని గురించి పట్టించుకోను. ఎందుకంటే ప్రతి కామెంట్ కి రియాక్ట్ కాలేము కదా? అని చెప్పుకొచ్చారు.
Priyamani
Virataparvam Movie
Bhamakalapam

More Telugu News