Krish: 'వీరమల్లు' కోసం క్రిష్ భారీ యాక్షన్ ప్లాన్!

  • 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న 'వీరమల్లు'
  • తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
  • భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగు మొదలు
  • భారీ సెట్లు .. కీరవాణి సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ  
Hari Hara Veera Mallu movie update

పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే తొలి సారిగా చారిత్రక నేపథ్యంతో ముడిపడిన 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఈ కథ మొగల్ కాలంలోను .. వర్తమానంలోను జరుగుతుంది. పవన్ కల్యాణ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగు మళ్లీ మొదలవుతోంది. తాజా షెడ్యూల్ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుకానుంది. అందుకు సంబంధించిన చర్చలు క్రిష్ తో పూర్తి చేసినట్టుగా ప్రముఖ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ చెబుతూ, అందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు.

'వీరమల్లు కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశామనీ, అందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని రాసుకొచ్చారు. భగవంతుడి ఆశీస్సులు తమ టీమ్ పై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మొగల్ కాలం నాటి భారీ సెట్లు .. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి.

  • Loading...

More Telugu News