Andhra Pradesh: ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

Andhra Pradesh Corona Updates
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,622
ఏపీలో గత 24 గంటల్లో 35,040 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 5,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 741 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 87 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కరోనాతో మృతి చెందారు.

ఇక 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 22,88,566కి పెరిగింది. వీరిలో 21,73,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,631 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News