Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

  • జూన్ 30లోగా ప్రొబేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ ఆదేశం
  • జూన్ 1 నాటికి కొత్త జీతాలను ఇవ్వాలన్న సీఎం
  • ఉద్యోగుల మంచి కోసమే పదవీ విరమణ వయసు పెంచామని వ్యాఖ్య
Good news to Village and ward volunteers

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ప్రోబేషన్ ప్రకటించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30వ తేదీకల్లా దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని... జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలను అందించాలని చెప్పారు.

మిగిలిన 25 శాతం మంది ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రొబేషన్ పై జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉద్యోగులకు మంచి జరగాలనే ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. జూన్ 30లోగా కారుణ్య నియామకాలను చేపట్టాలని అన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో ఉద్యోగులకు 10 శాతం స్థలాలను 20 శాతం రిబేటుపై కేటాయించామని చెప్పారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను మార్చి 5లోగా రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. ఉద్యోగుల డిమాండ్ ను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సేకరించిన స్థలంలో 5 శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్ చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News