PM Modi: బెంగాల్ గవర్నర్ ను తొలగించాలన్న తృణమూల్ ఎంపీకి ప్రధాని షాకింగ్ రిప్లయ్

You retire PM Modi quips after TMC MP urges Bengal Guvs removal
  • లోక్ సభలో సౌగతారాయ్ డిమాండ్
  • రాజీనామా చేయండి చూస్తాం
  • ప్రధాని మోదీ స్పందన
  • మర్మం అర్థం కాక రాయ్ అయోమయం
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్ దీప్ దన్ ఖర్ ను తప్పించాలంటూ లోక్ సభలో డిమాండ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ కు ఊహించని సమాధానం వచ్చింది. పార్లమెంట్ బడ్జెట్ రోజున జరిగిన ఈ విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించిన తర్వాత ప్రధాని ప్రతిపక్ష సభ్యులు ఆసీనులైన బెంచీల వైపు వెళ్లి అందరినీ పలకరించారు. ఆ సమయంలో తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ స్పందిస్తూ.. ‘‘దయచేసి బెంగాల్ గవర్నర్ ను తప్పించండి. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేస్తున్నారు’’ అని ప్రధానిని కోరారు.

దీనికి ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. ఆప్ రిటైర్ హో జాయే తబ్ దేఖ్కే హైన్ (ముందు మీరు రిటైర్ అయితే ఆ తర్వాత దాన్ని పరిశీలిస్తాం)’’ అని బదులిచ్చారు. ప్రధాని మాటల్లోని మర్మం అర్థం కాక ఆయన అయోమయానికి గురయ్యారు.

దీనిపై సౌగతా రాయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా నన్ను రాజీనామా చేయాలని ఆయన కోరుకుంటున్నారా? ఆ తర్వాత నా అభ్యర్థనను పరిశీలిస్తారా..? లేక నేను రాజీనామా చేస్తే నన్ను గవర్నర్ ను చేయాలనుకుంటున్నారా? అన్నది నాకు తెలియదు’’ అని వివరించారు. ఏమైనా ఇదంతా పరిహాసంగా ఉందని తృణమూల్ ఎంపీ వ్యాఖ్యానించారు. అలాగే, గవర్నర్ ను తప్పించాలన్న డిమాండ్ ను మరోసారి వినిపిస్తానన్నారు.
PM Modi
TMC MP
sougataroy
West Bengal
governar

More Telugu News