coliseum: తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు.. వివ‌రాలు ఇవిగో

coliseum recommends high court judges names
  • 12 మంది జడ్జిల నియామకానికి కొలీజియం సిఫార్సు 
  • న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లు ప్రతిపాద‌న‌
  • న్యాయవాదుల నుంచి ఏడుగురి పేర్లు సిఫారసు  
తెలంగాణ హైకోర్టుకు 12 మంది జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదుల నుంచి ఏడుగురు, న్యాయాధికారుల నుంచి ఐదుగురి పేర్లను జడ్జిలుగా ప్రతిపాదించింది.

న్యాయవాదులు కాసోజు సురేందర్‌, చాడ విజయ్‌ భాస్కర్‌రెడ్డి, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, మీర్జా సైఫియుల్లా బేగ్‌, నాచరాజు శ్రవణ్‌ కుమార్ వెంకట్‌ల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

న్యాయధికారుల జాబితాలో జి.అనుపమ చక్రవర్తి, ఎం.జి. ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌రెడ్డి, డి.నాగార్జున కొలిజీయం సిఫార్సు చేసిన వారిలో ఉన్నారు.

coliseum
TS High Court
Telangana
Supreme Court

More Telugu News