Arunachal boy: చైనా సైనికులు నా చేతులు కట్టేసి.. ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారు: అరుణాచల్ బాలుడు

I was given electric shocks by Chinese PLA Arunachal boy
  • మొహానికి వస్త్రాన్ని కట్టేశారు
  • ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లారు
  • కొట్టారు, హింసించారు
  • రెండో రోజు నుంచి నన్ను హింసించలేదు
చైనా సైనికుల చేతుల్లో తాను చిత్రహింసలకు గురైనట్టు అరుణాచల్ ప్రదేశ్ బాలుడు మిరమ్ తరోన్ (17) వెల్లడించాడు. చైనా సరిహద్దుల్లో మూలికల సేకరణకు వెళ్లిన తరోన్ ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు గత నెల 18న అపహరించుకుని పోవడం తెలిసిందే. భారత సైన్యం చేసిన సంప్రదింపులు ఫలించడంతో జనవరి 27న బాలుడ్ని చైనా సైన్యం అప్పగించింది.

మిరమ్ తరోన్ తన అనుభవాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నాడు. ‘‘మొదటి రోజు చైనా సైనికులు నా చేతులను తాళ్లతో కట్టి అడవుల్లోకి తీసుకెళ్లారు. మొహానికి వస్త్రాన్ని కట్టి, అక్కడి నుంచి ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లారు. హింసించారు. కొట్టారు. ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారు. కానీ అది మొదటి రోజుకే పరిమితం. రెండో రోజు నుంచి  నన్ను హింసించలేదు. ఆహారంతోపాటు, నీరు కూడా ఇచ్చారు’’ అని చెప్పాడు.
Arunachal boy
abducted
china
pla
electric shocks

More Telugu News