Balakrishna: జోరు మీదున్న బాలయ్య... పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్?

Balakrishna in Parashuram Movie
  • 'అఖండ'తో హిట్ కొట్టిన బాలయ్య
  • గోపీచంద్ మలినేనితో సెట్స్ పైకి
  • నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడితో
  • లైన్లో కొరటాల .. శ్రీకాంత్ అడ్డాల    
టాలీవుడ్ లో యంగ్ హీరోలతో సీనియర్ స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. వరుసగా భారీ ప్రాజెక్టులను ఒప్పుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే రెండు మూడు సినిమాలను లైన్లో పెడుతున్నారు. చిరంజీవి అదే రూట్లో తన జోరును కొనసాగిస్తుండగా, బాలయ్య కూడా అదే పద్ధతిలో విజృంభిస్తున్నారు.

'అఖండ' విడుదల కావడానికి ముందుగానే ఆయన గోపీచంద్ మలినేని ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సమయంలోనే తాను అనిల్ రావిపూడితోను ఒక సినిమా చేయనున్నట్టు బాలకృష్ణ స్వయంగా చెప్పారు. ఇక ఎన్టీఆర్ తో సినిమా తరువాత కొరటాల చేసే ప్రాజెక్టు కూడా బాలకృష్ణతోనే అనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే దిల్ రాజు నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయడానికి అంగీకరించారనే వార్త కూడా నిన్ననే బయటికి వచ్చింది. ఇక పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి కూడా ఆయన ఓకే అన్నారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఆల్రెడీ ఇంతకుముందే కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Balakrishna
Gopichand Malineni
Anil Ravipudi
Parashuram Movie

More Telugu News